Andhra Pradesh: సర్పంచ్‌ ప్రమాణ స్వీకారంలో రికార్డింగ్ డ్యాన్సులు

Andhra Pradesh: తూర్పుగోదావరి జిల్లా కాపవరంలో అశ్లీల నృత్యాలు * విజయోత్సవ కార్యక్రమంలో రికార్డింగ్ డ్యాన్సులు

Update: 2021-02-27 06:18 GMT

తూర్పు గోదావరి జిల్లా రికార్డింగ్ డాన్స్ 

Andhra Pradesh: వారు గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా మారుస్తామని ఉపన్యాసాలు ఇచ్చారు ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత వారిలో మార్పు వచ్చింది. గెలిచామన్న ఉత్సహంలో శృతి మించారు. గ్రామ సమస్యలపై ఫోకస్ చేయాల్సిన ప్రజాప్రతినిధులు ప్రమాణ స్వీకరోత్సవంతోనే తలదించుకునే పని చేశారు.

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరం గ్రామ సర్పంచ్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో అశ్లీల నృత్యాలపై సర్వాత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఏర్పాటు చేసిన సంబరాలు శృతిమించి నూతన సర్పంచి, వార్డు సభ్యులు అమ్మాయిలో అసాంఘిక డ్యాన్స్‌లను చేయించారు. అసాఘింక నృత్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గ్రామాన్ని మోడల్ విలేజ్‌గా మారుస్తామని ఉపన్యాసాలు చేసిన వేదికపైనే అశ్లీల డ్యాన్స్‌లు వేయించడంపై స్థానికులు మండిపడుతున్నారు.

Tags:    

Similar News