Byreddy Rajasekhar Reddy: కృష్ణానదిపై నిర్మిస్తున్న తీగల వంతెనతో.. రాయలసీమకు ఎటువంటి ప్రయోజనం లేదు
Byreddy Rajasekhar Reddy: సీమ ఎమ్మెల్యేలు మొద్దునిద్ర వీడాలి
Byreddy Rajasekhar Reddy: కృష్ణానదిపై నిర్మిస్తున్న తీగల వంతెనతో.. రాయసీమకు ఎటువంటి ప్రయోజనం లేదు
Byreddy Rajasekhar Reddy: కేంద్ర ప్రభుత్వం సిద్ధేశ్వరం వద్ద కృష్ణానదిపై నిర్మిస్తున్న తీగల వంతెనతో రాయలసీమకు ఎటువంటి ప్రయోజనం లేదని రాయలసీమ అభివృద్ధి కమిటీ కన్వీనర్ బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. రాయలసీమలో శాశ్వతంగా కరువు నివారించాలంటే కృష్ణా నదిపై వంతెనతో కూడిన బ్యారేజీ నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమ ఎంపీలు, ఎమ్మెల్యేలు మొద్దునిద్ర వీడాలన్నారు. సిద్ధేశ్వరం వద్ద కృష్ణానదిపై ఐకానిక్ వంతెన బదులు బ్యారేజ్ కమ్ బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రజాఉద్యమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు భాగస్వాములు కావాలని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు.