Andhra Pradesh: ఏపీలో నిరసన బాట పట్టిన రేషన్‌ డీలర్లు

* కందిపప్పుకు సంబంధించిన బకాయిలు చెల్లించాలంటూ డిమాండ్‌ * నేడు రాజమండ్రిలో ఆలిండియా రేషన్‌ డీలర్ల ఆత్మీయ సదస్సు

Update: 2021-10-26 05:06 GMT

ఏపీలో నిరసన బాట పట్టిన రేషన్‌ డీలర్లు(ఫైల్ ఫోటో)

Andhra Pradesh: నేటి నుంచి ఏపీలో రేషన్‌ డీలర్లు నిరసనకు పిలుపునిచ్చారు. సమస్యలు పరిష్కరించే వరకు రేషన్ దిగుమతి, పంపిణీ నిలిపివేస్తున్నట్లు రేషన్ డీలర్ల సంఘం ప్రకటించింది. 2020 పీఎంజీకేవై కమీషన్ బకాయిలు తక్షణమే చెల్లించాలని రేషన్ డీలర్ల సంఘం డిమాండ్ చేసింది.

డీడీ నగదు వాపసు, ధరల వ్యత్యాస సర్క్యులర్లను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. డీలర్ల నుంచి ఐసీడీఎస్‌కు మళ్ళించిన కందిపప్పుకు సంబంధించిన బకాయిలను తక్షణమే చెల్లించాలని డీలర్లు కోరారు.

2020 మార్చి 29 నుంచి నేటి వరకు ఏపీ పౌరసరఫరాల కార్పొరేషన్ నుంచి డీలర్లకు రావాల్సిన కమీషన్ బకాయిలు చెల్లించాలన్నారు. గోనె సంచులను ప్రభుత్వానికి తిరిగిస్తే 20 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు చెల్లింపు చేయమని చెప్పడం సరైంది కాదన్నారు డీలర్లు.

గోనె సంచులు తిరిగి ఇవ్వకుంటే ఎలాట్‌మెంట్‌ కట్ చేసి కేసులు పెడతామని హెచ్చరించడం తగదన్నారు. గోనె సంచులు ప్రభుత్వం తీసుకునేలా ఇచ్చిన జీవో 10ని పక్క రాష్ట్రం తెలంగాణలో అమలు చేస్తున్నారని డీలర్లు గుర్తుచేశారు. ఏపీలోనూ జీవో 10ని యథాతథంగా అమలు చేయాలని రేషన్‌ డీలర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Full View
Tags:    

Similar News