Ramatheertham Issue: బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు అరెస్ట్
Ramatheertham Arrest: * రామతీర్థంలో హై టెన్షన్ * వన్‌టౌన్ పీఎస్‌కు సోము వీర్రాజు తరలింపు * ఎమ్మెల్సీ మాధవ్, బీజేవైఎం అధ్యక్షులు సురేంద్ర అరెస్ట్
BJP leder somu Veerraju (file image)
రామతీర్థంలో హై టెన్షన్ కొనసాగుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజును అరెస్ట్ చేశారు పోలీసులు. వన్‌టౌన్ పీఎస్‌కు సోము వీర్రాజు తరలించారు. అలాగే ఎమ్మెల్సీ మాధవ్, బీజేవైఎం అధ్యక్షులు సురేంద్రను కూడా అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. మరోవైపు ధర్మయాత్రలో పాల్గొనేందుకు బీజేపీ, జనసేన కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు.
విజయనగరం రామతీర్థం సంఘటనను పరిశీలించడానికి వెళ్లకుండా బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు. రామతీర్థం వెళ్తున్న ఎంపీ సీఎం రమేష్‌ను పోలీసులు విశాఖ బీజేపీ కార్యాలయం వద్ద అడ్డుకున్నారు. జరిగిన సంఘటనను పరిశీలించటానికి వెళ్తున్న తమని అడ్డుకోవడం సమంజసం కాదని సీఎం రమేష్ అన్నారు. హిందూ దేవాలయాల రక్షణ కోసం బీజేపీ ఎంత దూరమైన వెళ్తుందంటున్న సీఎం రమేష్