విగ్రహ విధ్వంసాలు దేనికి సంకేతం.. అసలు ఏపీలో ఏం జరుగుతుంది..?

ఆలయాలపై వరుస దాడుల ఘటనలు ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అంతర్వేదితో మొదలైన దాడులు తాజాగా విజయవాడ నడిబొడ్డు వరకు చేరుకున్నాయి.

Update: 2021-01-03 11:41 GMT

అంతర్వేదితో మొదలైంది. రామతీర్థం వరకు రాజుకుంది. మళ్లీ ఇప్పుడు విజయవాడలో మరో దేవతా విగ్రహం ధ్వంసం.. ఏపీలో ఆలయాలపై దాడులు ఆగడం లేదు. అసలు విగ్రహ విధ్వంసాలు దేనికి సంకేతం.. ఎవరికీ ప్రయోజనం.. ఆకతాయిలు చేస్తున్నా దుశ్చర్యనా.. రాజకీయం నాయకులు చేస్తున్నా దుస్సాహసమా.. అసలు ఏపీలో ఏం జరుగుతుంది.

ఆలయాలపై వరుస దాడుల ఘటనలు ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అంతర్వేదితో మొదలైన దాడులు తాజాగా విజయవాడ నడిబొడ్డు వరకు చేరుకున్నాయి. ఇంతవరకు ఏ ఒక్క ఘటనలో నిందితులు పట్టుబడలేదు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా దుండంగులు దారుణాలకు ఒడిగడుతున్నారు.

విజయనగరం జిల్లా రామతీర్థంలో రామయ్య విగ్రహా శిరస్సు ఖండన ఘటన ఏపీ రాజకీయాల్లో అగ్గిరాజేసింది. ఆ చిచ్చు ఆరకముందే.. తాజాగా విజయవాడలో సీతమ్మ తల్లి విగ్రహంపై దాడి చేశారు. అయితే.. ఆలయానికి వేసిన తాళం అలానే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్త తెలుసుకున్న స్థానికులు, హిందూ ధార్మిక ప్రతినిధులు, ప్రతిపక్షపార్టీల కార్యకర్తలు ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. దోషులపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు. ఆలయాల దాడుల వెనుక వైసీపీ ప్రభుత్వం హస్తం ఉందని టీడీపీ, బీజేపీ కార్యకర్తలు ఆరోపించారు. పరిస్థితిని అదుపుచేసేందుకు భారీగా పోలీసులు చేరుకున్నారు. ఆలయానికి వచ్చే అన్నిదారులను మూసివేయించారు.

దేవాలయాలపై వరుస సంఘటనలు జరగడంతో అన్ని శాఖలను అప్రమత్తం చేశామని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. రాష్ట్రంలోని దేవాలయాలు, ప్రార్థనా మందిరాల వద్ద నిరంతరం నిఘా, పెట్రోలింగ్, పోలీసు భద్రతను పెంచుతున్నామన్నారు. దేవాలయాలు ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని, అర్చకులు, పూజారులు, ఆలయ నిర్వాహకులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అన్నారు.

ఆలయాలపై దాడులు కొన్ని వెలుగులోకి వస్తూ ఉంటే.. మరికొన్ని రహస్యంగా దాచి ఉంచుతున్నారు. కృష్ణాజిల్లా ఉయ్యూరు శివాలయంలో కేతువు విగ్రహం రెండు నెలల క్రితం ఎవరో దుండగులు కూల్చేశారు. అయితే.. విగ్రహం కూల్చిన విషయాన్ని దేవస్థాన అధికారులు గోప్యంగా ఉంచారు. మరో విగ్రహం తయారీకి తెనాలిలో ఆర్డర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ నెల 8న విగ్రహ పున:ప్రతిష్టకు రహస్య ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు ఆలయం దగ్గరకు చేరుకొని ఆందోళన చేపట్టారు.

Tags:    

Similar News