Rajahmundry: మండలి రద్దు ముమ్మాటికీ చట్ట విరుద్ధం: జేఏసీ

సీఎం జగన్ పంతం నెగ్గించుకోవడం కోసం పెద్దల సభైన శాసన మండలిని రద్దు చేయడం ముమ్మాటికీ చట్ట విరుద్ధమని ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) నేతలు మండిపడ్డారు.

Update: 2020-01-29 11:04 GMT

రాజమహేంద్రవరం: సీఎం జగన్ పంతం నెగ్గించుకోవడం కోసం పెద్దల సభైన శాసన మండలిని రద్దు చేయడం ముమ్మాటికీ చట్ట విరుద్ధమని ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) నేతలు మండిపడ్డారు. శాసన మండలి తనకు అనుకూలంగా లేదని, తన ఇష్టానికి వ్యతిరేకంగా మండలి ఉందన్న కారణంతో సభనే రద్దు చేస్తామనడం చట్ట వ్యతిరేకమని, ఆ విధానం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ధ్వజమెత్తారు.

శాసన మండలికి రద్దుకు నిరసనగా, జగన్‌ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక పుష్కరాల రేవు నుంచి కోటగుమ్మం, మెయిన్‌ రోడ్డు మీదుగా రామాలయం జంక్షన్ వరకూ భారీ స్కూటర్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాలీని ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, తెలుగు యువత, కార్యకర్తలు, అభిమానులు , సీపీఐ, కాంగ్రెస్‌ పార్టీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ చెందిన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News