చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు

*విశా‌ఖ నిజాంపట్నం, కృష్ణపట్నం, మచిలీపట్నం.. ఓడరేవుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ

Update: 2022-11-22 03:48 GMT

చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు

Weather Report: నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వాయవ్యదిశగా కదులుతోంది. ఇది నిన్న అర్ధరాత్రి తర్వాత నుంచి పశ్చిమ వాయవ్యదిశగా పయనిస్తూ దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర తమిళనాడు వైపు పయనిస్తుందని ఐఎండీ వెల్లడించింది.

 వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడి దక్షిణాంధ్ర, తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇవాళ, రేపు ఉరుములు, మెరుపులతో దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల, ఉత్తర కోస్తాంధ్రలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ భారీవర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది.

తీరం వెంబడి గంటకు 65కి.మీ వేగంతో ఈదురు గాలులు విచే అవకాశం ఉంది. విశాఖ నిజాంపట్నం, కృష్ణపట్నం, మచిలీపట్నం ఓడరేవుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. చేపల వేటకు వెళ్లొద్దని మత్స్యకారులను అధికారుల హెచ్చరించారు.  

Full View
Tags:    

Similar News