Andhra Pradesh: ఏపీలో భారీ వర్షాలకు అప్రమత్తం అయిన రైల్వేశాఖ

Andhra Pradesh: 18 రైళ్లు రద్దు, 10 రైళ్లు దారి మళ్లింపు

Update: 2021-11-21 13:15 GMT

ఏపీలో భారీ వర్షాల కారణంగా 18 రైళ్లు రద్దు, 10 రైళ్లు ధరి మల్లింపు (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీలో భారీ భారీవర్షాలు, వరదల కారణంగా పలు రైళ్లు రద్దు చేయగా, మరి కొన్ని దారి మళ్లిచినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మొత్తం 18 రైళ్లను అధికారులు రద్దు చేయగా మరో 10 రైళ్లను దారి మళ్లించారు. ఇంకో రెండు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తూ రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. రద్దు చేసిన రైళ్లలో.. రామేశ్వరం-భువనేశ్వర్, పూరి-చెన్నై సెంట్రల్, పూరి-తిరుపతి, చెన్నై సెంట్రల్-జైపూర్, నాగర్‌సోల్-తిరువనంతపురం, తిరువనంతపురం-నాగర్‌సోల్, కొల్లం-తిరువనంతపురం, హౌరా- యశ్వంతపూర్, చెన్నై సెంట్రల్- హజరత్ నిజముద్దీన్, చెన్నై సెంట్రల్-హౌరా, చెన్నై సెంట్రల్- అహ్మదాబాద్, చెన్నై సెంట్రల్- విజయవాడ, గౌహతి- బెంగళూరు కంటోన్మెంట్, న్యూ తినుసుకియా- తాంబరం, తిరుపతి- హౌరా, చెంగల్‌పట్టు- కాచిగూడ ట్రైన్స్ ఉన్నాయి.

ఇక.. దారిమళ్లించిన రైళ్లలో హజరత్ నిజాముద్దీన్- కన్యాకుమారి, న్యూఢిల్లీ- చెన్నై సెంట్రల్‌, హౌరా- ఎర్నాకుళం, భువనేశ్వర్‌- బెంగళూరు కంటోన్మెంట్‌, న్యూ తిన్‌సుకియా- బెంగళూరు, హజరత్‌ నిజాముద్దీన్‌- చెన్నై సెంట్రల్‌, అహ్మదాబాద్‌- చెన్నై సెంట్రల్‌ రైలు, న్యూఢిల్లీ- చెన్నై సెంట్రల్‌, దానపూర్‌- బెంగళూరు, జైపూర్‌- చెన్నై సెంట్రల్‌ రైళ్లు ఉన్నాయి. ఇదే సమయంలో డిబ్రూగఢ్- కన్యాకుమారి ట్రైన్‌ను జల్‌పాయిగుడి- కన్యాకుమారి మధ్య తాత్కాలికంగా నిలిపివేశారు. హజరత్‌నిజాముద్దీన్‌- తిరుపతి ట్రైన్‌ను బిట్రగుంట- తిరుపతి మధ్య తాత్కాలికంగా నిలిపివేశారు.

Tags:    

Similar News