జగన్‌తో భేటీ కానున్న రఘువీరా.. వైసీపీలో చేరతారని ప్రచారం

ఇటీవలే ఇతర పార్టీ నుంచి వైసీపీలోకి జోరుగా చేరికలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.

Update: 2020-03-10 06:05 GMT
Jagan, Raghuveera Reddy File Photo

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మాజీ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ కానున్నారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం జగన్‌తో రఘువీరారెడ్డి అపాయింట్ మెంట్ ఖారారైంది. అయితే రఘువీర భేటీపై సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు మొదలైయ్యాయి. ఇటీవలే ఇతర పార్టీ నుంచి వైసీపీలోకి జోరుగా చేరికలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. రఘువీరారెడ్డి తన కూతురు వివాహానికి సీఎంను ఆహ్వానించేందుకు వెళ్తున్నారని కొందరు అంటుంటే , వైసీపీ చేరుతారని మరి కొందరు ప్రచారం చేస్తున్నారు.

కాగా.. రఘువీరా రెడ్డి అనుచరులు మాత్రం సీఎం జగన్‌ను వివాహానికి ఆహ్వానించేందుకు రఘువీరా కలుస్తున్నారని అనుచరులు చెబుతోన్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత రఘువీరారెడ్డికి పీసీసీ అధ్యక్షుడిగా అధిష్టానం ఎంపిక చేసింది. కాంగ్రెస్ పార్టీలోనే రఘువీరా మొదటి నుంచి కొనసాగుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ పదవికి రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై ప్రతిష్టంబన కొనసాగడంతో ఆయన రాజీనామాను పక్కన పెట్టారు. దీంతో రఘువీరానే పీసీసీ చీఫ్‌గా కొనసాగారు. కానీ, కాంగ్రెస్ అధిష్టానం ఏపీసీసీ అధ్యక్షుడిగా శైలజానాథ్‌కు బాధ్యతలు అప్పగించింది.

కొంత కాలం క్రితం రఘువీరా చిరంజీవిని కలిశారు. తన నియోజకవర్గంలోని నీలకంఠాపురంలో పంచముఖ ఆంజనేయస్వామి 52 అడుగులు విగ్రహం ప్రారంభోత్సవానికి చిరంజీవి దంపతులును ఆహ్వానించారని వార్తలు వచ్చాయి కూడా. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీ చేరుతారా? లేక కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా సాయంత్రంలోగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.



 

Tags:    

Similar News