SV University: తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో ర్యాగింగ్ కలకలం
SV University: తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎస్వీయూలో ప్రొఫెసర్ విశ్వనాథ రెడ్డి, సీనియర్ విద్యార్థులతో కలిసి ర్యాగింగ్ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నాడు.
SV University: తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో ర్యాగింగ్ కలకలం
SV University: తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎస్వీయూలో ప్రొఫెసర్ విశ్వనాథ రెడ్డి, సీనియర్ విద్యార్థులతో కలిసి ర్యాగింగ్ పేరుతో వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో విద్యార్థులు ప్రొఫెసర్‌పై చర్యలు తీసుకోవాలని రెక్టార్ కార్యాలయాన్ని ముట్టడించి, నినాదాలు చేశారు. ఆందోళన కారులను పంపించే ప్రయత్నంలో విద్యార్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేశామని విద్యార్థులు తెలిపారు. ర్యాగింగ్ పాల్పడిన సీనియర్ విద్యార్థులు ముగ్గురిని సస్పెండ్ చేయాలని, ప్రొఫెసర్ విశ్వనాథ్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు.