డిప్యూటీ కలెక్టర్‌గా శిక్షణా కాలం పూర్తి చేసుకుని పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న పీవీ సింధుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆమెను హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్ హౌస్ వద్ద ఆంధ్రప్రదేశ్ ఓఎస్‌డీగా నియమించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు.
ఇందుకోసం హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ గెస్ట్ హౌస్ వద్ద ఖాళీగా ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టును ఓఎస్‌డీగా అప్‌గ్రేడ్ చేస్తున్నారు. ఈ మేరకు రెండు మూడు రోజుల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలనీ ప్రొటోకాల్ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. కాగా డిప్యూటీ కలెక్టర్‌గా కొనసాగుతున్న తనను టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న తరుణంలో ఆన్‌డ్యూటీగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు.
ఆమె విజ్ఞప్తిపై సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. 2020 ఆగస్టు 30 వరకు ఆన్ డ్యూటీ సౌకర్యం మంజూరు చేస్తున్నట్లు ఇటీవల సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పీవీ సింధును 2018 డిసెంబర్ 7 న డిప్యూటీ కలెక్టర్ గా నియమిస్తూ అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.