Purandeswari: జీవీఎల్ వ్యాఖ్యలకు పురంధేశ్వరి కౌంటర్

Purandeswari: ఆ ఇద్దరు కాదు.. ఆ మహానుభావులు అంటూ పురంధేశ్వరి ట్వీట్

Update: 2023-02-17 08:05 GMT

Purandeswari: జీవీఎల్ వ్యాఖ్యలకు పురంధేశ్వరి కౌంటర్

Purandeswari: ఏపీ బీజేపీలో కొత్త పంచాయితీ మొదలైంది. ఎంపీ జీవీఎల్ ఎన్టీఆర్, వైఎస్సార్‌పై చేసిన వ్యాఖ్యలకు బీజేపీ సీనియర్ నాయకురాలు పురంధేశ్వరి కౌంటర్ ఇచ్చారు. సంక్షేమానికి ఆ ఇద్దరూ మాత్రమే కాదన్న జీవీఎల్ వ్యాఖ్యలపై పురంధేశ్వరి ట్విట్టర్‌లో స్పందించారు. ఆ ఇద్దరు కాదు.. ఆ మహానుభావులు అనాలని సూచిస్తూ పురంధేశ్వరి ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ తెలుగు జాతిక గుర్తింపు తెచ్చారని.. పేదలకు నిజమైన సంక్షేమం అందించారని ఆమె పేర్కొన్నారు. ఏపీలో జిల్లాలకు వైఎస్సార్, ఎన్టీఆర్ పేర్లు మాత్రమే పెట్టడంపై జీవీఎల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News