పేదలందరికీ ఇళ్ల స్థలాలు
అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు అందేలా చర్యలు చేపట్టాలని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అధికారులకు సూచించారు.
పులివెందుల: అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాలు అందేలా చర్యలు చేపట్టాలని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అధికారులకు సూచించారు. మార్చి నెలలో ఇంటి స్థలాలు పట్టాలు పంపిణీ చేసేందుకు స్థానిక కదిరి రహదారి శిల్పారామం ఉల్లి మెల్ల పరిసరాలలో ఎంపిక చేసిన ఇళ్ల స్థలాలను ఓఎస్డి అనిల్ కుమార్ రెడ్డి, తాసిల్దార్ శ్రీనివాసులు, నరసింహ రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ స్థలాల పంపిణీ తరువాత ప్రభుత్వమే ఇల్లు నిర్మించేలా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు. తాసిల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ నాలుగు వేల మంది ఇళ్లస్థలాల కోసం దరఖాస్తు చేస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.