గుంటూరు జిల్లాలో కోవిడ్ రూల్స్ పాటించని ప్రైవేట్ స్కూళ్లు
* స్కూల్ బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులను ఎక్కిస్తున్న వైనం * తడికొండలో బస్సును నిలిపివేసిన తల్లిదండ్రులు
Private Schools not Following Covid Rules in Guntur District
గుంటూరు జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లు కోవిడ్ నిబంధనలకు నీళ్లు వదిలేశారు. స్కూల్ బస్సుల్లో పిల్లలను ఇరికించేసి మరీ తరలిస్తున్నారు. గమనించిన పేరెంట్స్ స్కూల్ బస్సులను ఆపి నిరసన చేపట్టారు. ఈ సంఘటన తడికొండలో చోటు చేసుకొంది. కరోనా సమయంలో కూడా అధిక ఫీజ్‌లు తీసుకున్నారు. ఇప్పుడు పరిమితికి మించి బస్సుల్లో పిల్లలను ఎక్కిస్తారా అని నిలదీశారు.