'ఈ నెలాఖరుకల్లా ఆ బోర్డులను తొలగించాలి'

Update: 2019-10-28 06:35 GMT

ఈ నెల ఆఖరుకల్లా జిల్లాలలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు చెందిన కోచింగ్ బోర్డులను తొలగించాలని ఇంటర్మీడియట్ బోర్డు ఆర్‌ఐఓ గుండుకా రమణారావు ఆదేశాలు జారీ చేశారు. ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో మాట్లాడిన ఆయన కళాశాల నేమ్‌ బోర్డుపై కేవలం కళాశాల పేరు, అనుమతి ఉన్న గ్రూపులు, విద్యార్థుల సంఖ్యను మాత్రమే ఉండాలి, నేమ్‌ బోర్డు తెలుపు రంగులోనూ, నీలం రంగులో అక్షరాలు ఉండాలని స్పష్టం చేశారు. పాత బోర్డులను తొలగించకపోతే, రూ. 10000 జరిమానా విధించబడుతుందని చెప్పారు.

కాలేజీలు ఇంటర్మీడియట్ మార్కులు అలాగే గ్రేడింగ్ లను ప్రచారం చేసుకుంటే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. అలాగే ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు రూ .4,470 ఫీజు చెల్లించాలి. కళాశాలల్లో హాస్టళ్లు నిర్వహిస్తే అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఇంటర్ విద్యార్థులు బోర్డు సూచించిన పరీక్ష ఫీజులను మాత్రమే కట్టాలని సూచించారు.. ఒకవేళ కాలేజీ యాజమాన్యాలు అదనపు రుసుము వసూలు చేసినట్టయితే.. ఫిర్యాదు చేయాలనీ ఆయన కోరారు.  

Tags:    

Similar News