కరోనా ఎఫెక్ట్ : కడప కారాగారం నుంచి ఖైదీల విడుదల

Update: 2020-04-01 05:25 GMT

కరోనావ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న సోషల్ డిస్టెన్సింగ్ లో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాల జైళ్లలో ఉన్న ఖైదీల్లో కొందరిని విడుదల చేస్తున్నారు. జైళ్లలో రద్దీని తగ్గించటానికి కొంత మందిని రిలీజ్ చేసే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు మార్చి 23న రాష్ట్రాలను ఆదేశించింది.

దీంతో పలువురు దోషులను, అండర్ ట్రయల్స్ ని తాత్కాలికంగా బెయిల్ లేదా పెరోల్ మీద విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా కడప కేంద్ర కారాగారంలో ఉన్న 30 మంది ఖైదీలను బెయిల్‌పై అధికారులు విడుదల చేశారు. వీరిలో 16 మంది శిక్ష ఖైదీలు ఉండగాprisoners 14 మంది రిమాండ్‌ ఖైదీలు. కరోనా ప్రభావం కారణంగా జైళ్లలో రద్దీ తగ్గించే క్రమంలో అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఈ నెల 27న ఖైదీలంతా తిరిగి జైలుకు రావాలని జైలు అధికారులు ఆదేశించారు. 


Tags:    

Similar News