చిత్తూరు జిల్లా మదనపల్లెకు చేరుకున్న రాష్ట్రపతి
* రామ్‌నాథ్ కోవింద్‌కు స్వాగతం పలికిన సీఎం జగన్ * సత్సంగ్ ఆశ్రమాన్ని సందర్శిస్తున్న రాష్ట్రపతి * రాష్ట్రపతి వెంట జగన్, మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి
President Ramnath Kovind (file image)
చిత్తూరు జిల్లా మదనపల్లెకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేరుకున్నారు. రాష్టపతికి సీఎం జగన్‌కు స్వాగతం పలికారు. మదనపల్లెలోని సుప్రసిద్ధ తత్వవేత్త ముంతాజ్ అలీకి చెందిన సత్సంగ్ ఆశ్రమాన్ని రాష్ట్రపతి సందర్శిస్తున్నారు. ఆశ్రమ నిర్మాణాలు, స్వస్థ్య ఆస్పత్రికి శంకుస్థాపన చేస్తారు. అక్కడే భారత్ యోగా విద్యా కేంద్రానికి సంబంధించిన యోగా కేంద్రాన్ని ప్రారంభిస్తారు. సుమారు మూడు గంటలపాటు రాష్ట్రపతి అక్కడే గడపనున్నారు. అనంతరం సదుం మండలంలో ముంతాజ్ అలీ నిర్వహిస్తున్న పీపల్ గ్రో పాఠశాలకు చేరుకుంటారు. అక్కడ విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం 4.50 గంటలకు అక్కడ నుంచి బయల్దేరి తిరిగి బెంగుళూరు వెళతారు.