ప్రజాశాంతి పార్టీకి ఎదురుదెబ్బ

Update: 2019-02-12 13:52 GMT

మత ప్రబోధకుడు కేఏ పాల్ స్థాపించిన ప్రజాశాంతి పార్టీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి మహిళా నేత శ్వేతారెడ్డి రాజీనామా చేశారు. పాల్ వ్యవహారశైలి తనకు నచ్చని కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్వేతారెడ్డి వెల్లడించారు. రాజకీయాల్లో వైయస్ జగన్ కు ఓ విజన్ ఉంది, చంద్రబాబునాయుడుకు ఓ విజన్ ఉంది, అలాగే పవన్ కళ్యాణ్ కు ఓ విజన్ ఉంది. కానీ పాల్ కు మాత్రం ఎటువంటి విజన్ లేదని ఆమె విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలిస్తే ఏదో చేస్తానని చెబుతున్న పాల్ ఎన్నికల్లో సొంత డబ్బా పనికి రాదని హితవు పలికారు. పాల్ వ్యవహారాహారశైలి వలన పార్టీలోని చాలా మంది కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని శ్వేతారెడ్డి మండిపడ్డారు. కాగా శ్వేతారెడ్డిని హిందూపురం అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా పాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Similar News