Visakhapatnam: కరోనా ఎఫెక్ట్ తో కొలుకుంటున్న ఫౌల్ట్రీ

కరోనా వైరస్ దెబ్బకు నిన్నటి దాకా కుదేలైన ఫౌల్ట్రీ రంగం లాక్ డౌన్ నేపధ్యంలో కొద్దిగా కోలుకునే పరిస్థితి వచ్చింది.

Update: 2020-04-04 10:29 GMT

కరోనా వైరస్ దెబ్బకు నిన్నటి దాకా కుదేలైన ఫౌల్ట్రీ రంగం లాక్ డౌన్ నేపధ్యంలో కొద్దిగా కోలుకునే పరిస్థితి వచ్చింది. కరోనాతో పౌల్టీ పరిశ్రమ కోలుకోలేని నష్టాల్లో కూరుకుపోగా లాక్ డౌన్ కాస్త పౌల్టీకి ఊరటనిస్తుంది. ఇక నిత్యావసరాలు, కూరగాయలు, చికెన్, మటన్, చేపలు తదితరాలు మాత్రమే విక్రయిస్తున్న నేపధ్యంలో కోళ్ళ ధరలకు రెక్కలు వచ్చాయి. చికెన్ అంటేనే ఆమడ దూరం పారిపోయిన ప్రజలు కరోనా ఎఫెక్ట్ తో నిన్నా, మొన్నటి దాకా కోడి తినాలంటేనే ప్రజలు భయపడ్డారు. కోడి తింటే కరోనా వస్తుందని భావించిన నేపధ్యంలో చికెన్ వైపు ఎవరూ చూడలేదు.

కరోనా వైరతో పాటు కోళ్ళకు కొక్కెర వ్యాధి వస్తుందన్న భయం ప్రజలను చికెన్ అంటేనే మాకొద్దు అనేలా చేసింది. ఇక చికెన్, గుడ్లు తింటే కరోనా వస్తుందని సోషల్ మీడియాలో పలు ప్రచారాలు కూడా జరిగాయి. దీంతో కోళ్ళను కొనే వాళ్ళు లేక, వాటిని మేపలేక చాలా మంది పార్టీ ఫాంల యజమానులు వాటిని ఫ్రీగా ఇచ్చేశాయి. ఇక అంతే కాదు కొందరు కోళ్ళను గొయ్యి తీసి బతికుండగానే పూడ్చేశారు. ఇక దీంతో చికెన్, గుడ్డు ధరలు అమాంతం పడిపోయాయి. 

Tags:    

Similar News