Andhra Pradesh: మా గోడు వినండి..సీఎంకు మజ్జి దేవిశ్రీ లేఖ

Andhra Pradesh: కళాకారుల సమస్యలు పరిష్కరించాలని సీఎం జగన్ కి ప్రజాగాయకుడు మజ్జి దేవిశ్రీ లేఖ రాశారు

Update: 2021-06-05 11:50 GMT

మ‌జ్జి దేవిశ్రీ, జగన్ ఫైల్ ఫోటో 

Andhra Pradesh: కళాకారుల సమస్యలు పరిష్కరించాలని సీఎం జగన్ కి ప్రజాగాయకుడు మజ్జి దేవిశ్రీ లేఖ రాశారు. ఈ రాష్ట్రం లో పేద కళాకారులు ఆకలితో అలమ టిస్తూ దినదిన గండం గా బ్రతుకుతున్నారని ప్రజాగాయకుడు మజ్జి దేవిశ్రీ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖలో పేర్కొన్నారు . ఈ సందర్భంగా లేఖ లో దేవిశ్రీ ప్రస్తావిస్తూ కరోనా సమయములో కళాకారులు ప్రదర్శనలు లేక అనేక సమస్యలు తో సతమతమవుతున్న రని అన్నారు మీరు ముఖ్యమంత్రి అయిన తరువాత అంతమంది ప్రజలను ఆదుకోవడం జరిగిందని కానీ  కళాకారులని పట్టించుకోలేదని దేవిశ్రీ ఆవేదన వెలుబుచ్చారు.

వైస్ రాజశేఖర్ రెడ్డి కళాకారులని ఆదుకోవాలంటూకళాకారులని ఆదుకోవాలంటూడం లో ఎప్పుడు ముందుండే వారని గుర్తు చేశారు పేద కళాకారులని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని అన్నారు. డప్పుకాలకరులకి పెన్షన్ లు మంజూరు చేయాలని,పేద కళాకారుల కుటుంబాలకు ఇల్లు,ఇల్లుపట్టలు మంజూరు చేయాలని కోరారు. కళాకారులని ఏ ప్రభుత్వం అయితే బాగా చూస్తుందో ఆ ప్రభుత్వం పధికాలలు పాటు చల్లగా ఉంటుంది అని దేవిశ్రీ లేఖ లో పేర్కొన్నారు. కళాకారులకి గుర్తింపు కార్డ్ లు మంజరి చేయాలని కవిడ్ సమయములో మరణించిన కళాకారులకి 5 లక్షలు పరిహారం ఇవ్వాలని తెలిపారు.

కరోనా కారణంగా ప్రదర్శనలు లేక ఇబ్బంది పడుతున్న కళాకారుల కుటుంబాలకు నెలకు 10వేలు చప్పున ఇవ్వాలని లేఖ లో పేర్కొన్నారు. అందరి సమస్యలు పరిష్కరించే ముఖ్యమంత్రి మా కళాకారుల సమస్యలు ఎందుకు పట్టించు కోలేదని లేఖలో దేవిశ్రీ ఆవేదన చెందారు. ఇక నైనా మా సమస్యలు పరిష్కరించాలని దేవిశ్రీ లేఖలో కోరారు లేదంటే భవిష్యత్తు లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతానని దేవిశ్రీ అన్నారు.


Tags:    

Similar News