Tirupati: రాజకీయ రణరంగాన్ని తలపిస్తున్న టెంపుల్ సిటీ

Tirupati: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ముందు టెంపుల్ సిటీ రణరంగాన్ని తలపిస్తోంది.

Update: 2021-04-08 15:25 GMT

Tirupati: రాజకీయ రణరంగాన్ని తలపిస్తున్న టెంపుల్ సిటీ

Tirupati: తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక ముందు టెంపుల్ సిటీ రణరంగాన్ని తలపిస్తోంది. మళ్లీ తిరుమల ప్రధాన అర్చకుడిగా బాధ్యతలు స్వీకరించిన రమణ దీక్షితులు వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సీఎం జగన్‌ను సాక్షాత్తూ విష్ణుమూర్తితో పోల్చడం రాజకీయ రచ్చకు కారణం అవుతోంది.

ఏపీ సీఎం జగన్ ధర్మాన్ని పునరుద్ధరించడానికి అవతరించిన విష్ణుమూర్తిలా కనిపిస్తున్నాడని టీటీడీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీస్తున్నాయి. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రిని కలిసిన రమణ దీక్షతులు జగన్ ను మహావిష్ణువుతో పోల్చారు. ధర్మాన్ని రక్షించడంలో సీఎం జగన్ విష్ణుమూర్తిలా వ్యవహరిస్తున్నారని కొనియాడారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఏపీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

రమణదీక్షితుల కామెంట్స్ కు టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. మనిషి ఎప్పుడూ దేవుడు కాలేడన్నారు. రమణ దీక్షితుల వ్యాఖ్యలపై పరోక్షంగా చంద్రబాబు రమణదీక్షితుల వ్యాఖ్యలను ఖండించారు. పింక్ డైమండ్ మాయం అయిందని ఆరోపణలు చేసిన వ్యక్తిని మళ్లీ నియమించడం సరికాదని చంద్రబాబు అన్నారు. దీనివల్ల హిందువల మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు.

మరోవైపు పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాలకు తిరుపతి కేరాఫ్ అడ్రస్ గా మారిందని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీటీడీపై అనేక ఆరోపణలు చేసిన వైసీపీ టీటీడీని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లోకి ఎందుకు తీసుకురాలేకపోతుందని ప్రశ్నించారు. టీటీడీ ఆస్తులపై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీలో దేవాలయాలు కూల్చినా మాట్లాడని సీఎం జగన్ తన ప్రశ్నలకు సమాధానమిచ్చి తిరుపతిలో ఓట్లు అడగాలని అన్నారు.

Tags:    

Similar News