దయచేసి ఇంటికి వెళ్ళండి... చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్న పోలీసులు!

కరోనా వైరస్.. ఇప్పుడు ఏ ఇద్దరు కలిసిన దీని గురించే చర్చ... ఈ మహమ్మారి వ్యాధి వలన ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

Update: 2020-03-22 11:56 GMT

కరోనా వైరస్.. ఇప్పుడు ఏ ఇద్దరు కలిసిన దీని గురించే చర్చ... ఈ మహమ్మారి వ్యాధి వలన ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు... చైనాలోనీ వ్యూహాన్ లో మొదలైన ఈ వైరస్ మెల్లిమెల్లిగా ఇతర దేశాల్లో కూడా వ్యాపించి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దాదాపు 180 దేశాలకి పైగా వ్యాపించి 13 వేల మందిని బలితీసుకుంది. ఇక భారత్లో 300 కేసులు నమోదయ్యాయి. ఇక మరణించిన వారి సంఖ్య నేటితో 7కు చేరుకుంది. ఇందులో మూడు మరణాలు ఈరోజు సంభవించినవే..

అయితే ఈ వైరస్ పై యుద్దానికి సూచికగా ప్రధాని మోడీ సూచించిన జనతా కర్ఫ్యూను దేశం మొత్తం పాటిస్తోంది. దీనితో ప్రజలు ఎవరికి వారే స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూలో పాల్గొంటున్నారు.. దీనితో రోడ్లు వీధిలో నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.. అవసరమైతే తప్ప బయటకి రావడం లేదు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు కూడా బయటకు రాకుండా జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతోంది.

జనతా కర్ఫ్యూనీ విజయవంతం చేయడంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారు.. ఎవరైనా రోడ్ల పైకి వస్తే దయచేసి ఇంటికి వెళ్ళమని రిక్వెస్ట్ చేస్తున్నారు.. అంతేకాకుండా చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఇళ్లల్లోకి వెళ్లండి అని బతిమాలుతున్నారు. దయచేసి జనతా కర్ఫ్యూకి సపోర్ట్ చేయండి అని వేడుకుంటున్నారు.. ఇక మీడియా వారు ఐడి కార్డు చూపిస్తే వదిలేస్తున్నారు.. ప్రస్తుతం వీటికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి..

యువతికి సహాయం:

విజయవాడ కోనేరు సెంటర్ లో ఓ యువతికి పోలీసులు అండగా నిలిచారు. అప్పుడే హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ యువతి ఇంటికి వెళ్లడానికి ఏలాంటి సౌకర్యం లేకపోవడంతో కంగారు పడుతుంది. ఇది గమనించిన ఎఎస్పి మోకా సత్తిబాబు ఆమె పరిస్థితిని అర్థం చేసుకుని ఎక్కడికి వెళ్లాలో ఆమె వివరాలు అడిగి తెలుసుకొని దగ్గరుండి పోలీసు వాహనంలో ఎక్కించి, సెక్యూరిటీనీ ఇచ్చి పంపించి ఇంటిదగ్గర దింపమని ఆదేశించారు. అంతేకాకుండా పక్కనే ఉన్న మరో యువకుడికి ఇదే పరిస్థితి ఎదురుకావడంతో అతని బైక్ పైన ఇంటి దగ్గర దించాలని ఆదేశించారు. ఇక ప్రధాని మోడీ పిలుపునిచ్చిన జనతా కర్ఫ్యూ ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగనుంది.

Tags:    

Similar News