Visakha CP: మద్యం మత్తులో పక్కబోటులోకి సిగరెట్లు విసిరేశారు
Visakha CP: అగ్నిప్రమాదంలో 30బోట్లు కాలిపోయాయి
Visakha CP: మద్యం మత్తులో పక్కబోటులోకి సిగరెట్లు విసిరేశారు
Visakha CP: విశాఖలోని ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన ఘటనలో నైలాన్ వలల వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని నగర సీపీ రవిశంకర్ చెప్పారు. ఈ అగ్నిప్రమాదంలో 30 బోట్లు కాలిపోయాయన్నారు. ఈ ఘటనలో వాసుపల్లి నాని, అతడి మామ సత్యం ప్రధాన నిందితులుగా తేల్చామని చెప్పారు. మద్యం మత్తులో సిగరెట్లు పక్కబోటులోకి విసిరేశారని ఆయన వివరించారు. బోటు ఇంజిన్‌పై సిగరెట్ పడటంతోనే ప్రమాదం జరిగిందని...దర్యాప్తు చేసి నిందితులను పట్టుకుంటామని విశాఖ సీపీ చెప్పారు.