Koneti Adimulam: ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు నమోదు
Koneti Adimulam: రాసలీలల బాగోతం ఘటనలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆది మూలంపై కేసు నమోదైంది.
Koneti Adimulam: ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు నమోదు
Koneti Adimulam: రాసలీలల బాగోతం ఘటనలో సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆది మూలంపై కేసు నమోదైంది. సెక్సువల్ హెరాస్‌మెంట్ కింద బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆది మూలంపై తిరుపతి ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేశారు. భీమాస్ పారడైజ్ రూమ్‌లో తన ప్రమేయం లేకుండా అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో కొత్త క్రిమినల్ చట్టం BNS- 430/2024 ప్రకారం కేసు నమోదు చేశారు.
ఆధారాల కోసం భీమాస్ పారడైజ్ హోటల్ లో సి.సి. పుటేజీనీ సేకరించారు ఈస్ట్ పోలీసులు. లైంగిక ఆరోపణలతో నేడో, రేపో ఎమ్మెల్యే పదవీకి ఆదిమూలం రాజీనామా చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే రాసలీలల బాగోతం బయటపడగానే టీడీపీ అధిష్టానం అతన్ని పార్టీ నుంచి సస్సెండ్ చేసింది.