Polavaram: జగన్ సర్కార్.. మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తోంది: పవన్
Polavaram: పోలవరం ప్రాజెక్టుల నిర్వాసితుల పట్ల జగన్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు.
Polavaram: జగన్ సర్కార్.. మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తోంది: పవన్
Polavaram: పోలవరం ప్రాజెక్టుల నిర్వాసితుల పట్ల జగన్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. నిర్వాసితులకు ఎలాంటి పునరావాసం కల్పించకుండా బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని మండిపడ్డారు. కనీస దయ లేకుండా నిర్వాసితులను ఉన్నఫళంగా తరలిస్తున్నారన్న పవన్ కల్యాణ్ పోలవరం ప్రాజెక్టు కోసం ఎన్నో త్యాగాలు చేసిన వారికిచ్చే బహుమానం ఇదేనా? అంటూ ప్రశ్నించారు.
గిరిజనులపై జగన్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తోందన్న జనసేనాని ఇది కచ్చితంగా మానవ హక్కుల్ని ఉల్లంఘినే అన్నారు. గిరిజనుల పట్ల జగన్ ప్రభుత్వం అనుసరిస్తోన్న వైఖరిని జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇప్పటికైనా పునరావాసం కల్పించాకే నిర్వాసితులను తరలించాలని పవన్ డిమాండ్ చేశారు.