Narendra Modi - YS Jagan: ఏపీ సీఎం జగన్‌కు ప్రధాని మోడీ ఫోన్
Narendra Modi - YS Jagan: * గులాబ్ సైక్లోన్‌పై ఆరా తీసిన ప్రధాని * కేంద్రం నుంచి సహకారం అందిస్తామని హామీ
ఏపీ సీఎం జగన్‌కు ప్రధాని మోడీ ఫోన్
Narendra Modi - YS Jagan: ఏపీ సీఎం జగన్‌కు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. గులాబ్ సైక్లోన్‌పై ఆయన ఆరా తీశారు. కేంద్రం నుంచి సహకారం అందిస్తామని హామీ ఇచ్చిన మోడీ.. అందరూ క్షేమంగా ఉండాలని ఆకాక్షించారు.
ఇక.. ఏపీ వైపు దూసుకొస్తున్న గులాబ్ తుపాను.. రాత్రికి తీరం దాటే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ స్పష్టం చేసింది. గోపాల్‌పూర్-కళింగపట్నం మధ్య తీరం దాటే ఛాన్స్ ఉందని, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాలపై తుపాను ప్రభావం అధికంగా ఉంటుందని హెచ్చరించింది. శ్రీకాకుళం-ఒడిశా సరిహద్దు ప్రాంతాలపై మరింత ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని వివరించింది.
గులాబ్ తుపానుపై ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించారు. మరోవైపు.. రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు.. వరద పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.