PM Modi: సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) బుధవారం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి చేరుకుని సత్యసాయి శతజయంత్య ఉత్సవాలలో పాల్గొన్నారు. సాయి కుల్వంత్ హాల్‌లో సత్యసాయి మహా సమాధిని ప్రధాని దర్శించుకున్నారు.
PM Modi: సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్న ప్రధాని మోదీ
పుట్టపర్తి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) బుధవారం పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయానికి చేరుకుని సత్యసాయి శతజయంత్య ఉత్సవాలలో పాల్గొన్నారు. సాయి కుల్వంత్ హాల్‌లో సత్యసాయి మహా సమాధిని ప్రధాని దర్శించుకున్నారు.
ప్రధానితో పాటు ఏపీ సీఎం ఎన‍్. చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. అనంతరం మోదీ హిల్ వ్యూ స్టేడియంకు వెళ్లారు.
బాబా జీవితం, బోధనలు, సేవలను స్మరించుకుంటూ రూపుదిద్దుకున్న రూ.100 స్మారక నాణెం మరియు నాలుగు తపాలా బిళ్లలను ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు.
ఈ వేడుకకు క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, ప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ తదితర ప్రముఖులు హాజరయ్యారు.