Tirumala: తిరుమల కొండపై మరోసారి విమానం చక్కర్లు

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయం పై నుంచి విమాన రాకపోకలు కలకలం రేపుతున్నాయి.

Update: 2023-06-29 10:51 GMT

ఫైల్ ఫోటో 

Tirumala: తిరుమల శ్రీవారి ఆలయం పై నుంచి విమాన రాకపోకలు కలకలం రేపుతున్నాయి. గత కొద్ది రోజులుగా తిరుమల కొండపై నుంచి విమానాలు తరుచూ వెళ్తుండటం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ ఏకంగా‌ ఆలయం గగనతలంపై నుంచి ఓ విమానం వెళ్ళింది. ఆగమశాస్త్రానికి విరుద్ధంగా.. ఆధ్మాత్మిక క్షేత్రం పై నుంచి విమానాల రాకపోకలు కొనసాగుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పదే పదే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని టీటీడీ అధికారులు ఫిర్యాదు చేసినప్పటికీ.. విమానయానశాఖ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Tags:    

Similar News