Tirumala Temple: తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నపీయూష్ గోయల్

Tirumala Temple: తిరుపతి రైల్వేస్టేషన్ ను అభివృద్ధి చేసి, మరిన్ని రైళ్లను పెంచుతున్నామని పియూష్ గోయల్ ప్రకటించారు.

Update: 2021-03-13 06:05 GMT

ఇమేజ్ సోర్స్:(ది హన్స్ ఇండియా)

Tirumala: తిరుపతి రైల్వేస్టేషన్ ను అభివృద్ధి చేసి, మరిన్ని రైళ్లను పెంచుతున్నామని పియూష్ గోయల్ ప్రకటించారు. శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని పీయూష్ గోయల్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తులను దృష్టిలో పెట్టుకొని తిరుపతి రైల్వేస్టేషన్ ను అభివృద్ధి చేసి మరిన్ని రైళ్లు నడిపే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 80శాతం రైళ్లను పున్నరుద్దరించామని.. డిమాండ్ ఉన్న ప్రతీ చోట రైళ్లను నడుపుతున్నామన్నారు.

ఆదర్శంగా నిలిచిన భారత్...

కరోనాను ఎదుర్కోవడంలో ప్రపంచంలోనే అన్ని దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందని అన్నారు. 150దేశాలకు మందులు సరఫరా చేయ్యగా...ఇప్పటికే 75 దేశాలకు వాక్సిన్ పంపిణీ చేశామన్నారు. కరోనా ప్రభావం ఇంకా తగ్గలేదని...వాక్సినేషన్ ప్రక్రియ ముగిసే వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కేంద్రమంత్రి పియూష్ గోయల్ సూచించారు.

ఎన్నికల స్టంటే..

తిరుపతికి మరిన్ని రైళ్లు నడిపుతామని చేసిన పీయూష్ గోయల్ కామెంట్స్ పై ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారని..ఓట్ల కోసం రాజకీయం చేయడం తప్ప వీరు చేసేది ఏమి లేదని ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు.

Tags:    

Similar News