Indian Navy: హెలికాప్టర్ల మధ్యలోకి పక్షి.. తర్వాత ఏం జరిగిదంటే?

Update: 2024-12-01 04:55 GMT

Indian Navy: భారతనౌకాదళ సన్నాహక విన్యాసాల్లో శనివారం పెను ప్రమాదం తప్పింది. తొలిసారిగా ఈ ఏడాది భారత నేవీ డే సెలబ్రేషన్స్ ఒడిశాలోని పూరి సాగర తీరంలో ఏర్పాటు చేసేందుకు భారత నౌకాదళ యంత్రాంగంతోపాటు ఆ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా సన్నాహాలు చేపట్టాయి. దీనిలో భాగంగా శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఎయిర్ క్రాఫ్ట్స్ , హెలికాప్టర్ల సన్నాహక విన్యాసారాల్లో పాల్గొన్నాయి. హెలికాప్టర్లు గాల్లో ఉన్న సమయంలో ఒక్కసారిగా ఓ పక్షి ఎగురుకుంటూ వాటి మధ్యలోకి వచ్చింది.

అయితే ఆ పక్షిని గమనించిన ఫైలెట్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. నేవీ విన్యాసాలకు 15రోజులు ముందుగానే తీరం వెంబడి ఎలాంటి తినుబండారాలు, వ్యర్థాలు లేకుండా పర్యవేక్షించాల్సి ఉంటుందని..అలా చేయకపోతే పక్షులు తాకిడిని అరికట్టడం కష్టంగా ఉంటుందని స్థానికులు అంటున్నారు.



Tags:    

Similar News