Andhra Pradesh: శాసన మండలి రద్దు యోచనలో ప్రభుత్వం: మంత్రి బోస్

శాసన మండలి రద్దు యోచనలో జగన్ సర్కార్ ఉందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు.

Update: 2020-01-25 08:25 GMT

మండపేట: శాసన మండలి రద్దు యోచనలో జగన్ సర్కార్ ఉందని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. అసెంబ్లీ సమావేశాలు నుండి నేరుగా మండపేట విచ్చేసిన ఆయన క్యాంప్ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు ఉపయోగడ లేని మండలి అవసరం లేదన్నారు. మండలి రద్దు అయితే తన ఉపముఖ్యమంత్రి పదవి పోతుందనే ఆలోచన కొంచెం కూడా లేదన్నారు. తనకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యమని, పదవులు అక్కరలేదని పేర్కొన్నారు.

తన కోసం ఆలోచించవద్దని, మండలి రద్దు చేస్తేనే మంచిదనే అభిప్రాయాన్ని తానే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి సూచించినట్లు పేర్కొన్నారు. తమ పార్టీ ప్రయోజనాలు కోసం విచక్షణాధికారాన్ని వాడి షరీప్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసారని విమర్శించారు. సలహాలు, సూచనలు కోసం కాకుండా పార్టీల కోసం మండలి ఉపయోగపడటం బాధాకరమన్నారు. సమావేశంలో వైకాపా నేతలు కర్రి పాపారాయుడు, రెడ్డి రాధ కృష్ణ, వేగుళ్ళ పట్టాభి, పెంకే గంగాధర్, పిల్లా వీరబాబు, సిరిపురపు శ్రీనివాసరావు, వల్లూరి రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News