Perni Nani: కొత్త పీఆర్సీతో జీతాల్లో కోత పడుతుందనేది అవాస్తవం
Perni Nani: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పట్ల జగన్‌కు ప్రేమ, సానుభూతి ఉన్నాయి కాబట్టే..
Perni Nani: కొత్త పీఆర్సీతో జీతాల్లో కోత పడుతుందనేది అవాస్తవం
Perni Nani: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పట్ల జగన్‌కు ప్రేమ, సానుభూతి ఉన్నాయి కాబట్టే సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టిన నెల రోజుల్లోపే 27శాతం మధ్యంతర భృతి ప్రకటించారని గుర్తుచేశారు మంత్రి పేర్నినాని. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 23శాతం ఫిట్‌మెంట్ అమలు చేయాలన్న సీఎం జగన్ ఆలోచన ఉద్యోగులపై ప్రేమ కాదా అని ఉద్యోగ సంఘాలు ఆలోచించాలన్నారు.
ఉద్యోగుల ఐఆర్‌పై వక్రీకరణలు సరికాదని మంత్రి పేర్ని నాని అన్నారు. అన్ని అంశాలు తెలిసి కూడా కొందరు వక్రీకరణ చేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవ పరిస్థితులను ఉద్యోగులు అర్థం చేసుకోవాలని తెలిపారు. కొత్త పీఆర్సీతో జీతాల్లో కోతపడుతుందనేది అవాస్తవమని మంత్రి తెలిపారు.