Perni Nani: చెప్పు కాదు పవన్.. పార్టీ గుర్తు పోయింది చూస్కో..
Perni Nani vs Pawan Kalyan: నువ్వు ఒక చెప్పు చూపిస్తే.. రెండు చెప్పులు చూపిస్తా.. యస్..ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది.
Perni Nani: చెప్పు కాదు పవన్.. పార్టీ గుర్తు పోయింది చూస్కో..
Perni Nani vs Pawan Kalyan: నువ్వు ఒక చెప్పు చూపిస్తే.. రెండు చెప్పులు చూపిస్తా.. యస్..ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ నేత పేర్ని నాని మధ్య చెప్పు రాజకీయం ముదురుతోంది. తనను బూతులు తిట్టడంపై పవన్ కల్యాణ్.. గతంలో.. చెప్పు చూపించి వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. దీనికి కౌంటర్‌గా మూడు రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని రెండు చెప్పులు చూపించి పవన్ కల్యాణ్‌ను విమర్శించారు.
అయితే ఆ చెప్పులు తనవేనని.. ఓ వైసీపీ నాయకుడు ఎత్తుకెళ్లాడని పవన్ కల్యాణ్ అంతే దీటుగా రిప్లై ఇచ్చారు. ఇక పవన్ కల్యాణ్ ఇచ్చిన చెప్పు రిప్లైపై పేర్ని నాని మరోసారి స్పందించారు. చెప్పులు పోయి మూడు రోజులు అయితే పవన్ ఇప్పుడు కంగారు పడుతున్నారని ఎద్దేవా చేశారు. గతేదాడి గుడికి వెళ్తే అక్కడ తన చెప్పు పోయిందని.. అయితే గుడి ఎదురుగా జనసేన ఆఫీసు ఉందని.. పవన్ కల్యాణ్‌ను అనుమానిస్తామా అని సెటైర్లు వేశారు. చెప్పులు పోతో ఎవరో ఒక ప్రొడ్యూసర్ కొనిస్తారని, కానీ జనసేన పార్టీ సింబల్ గాజు గ్లాసు పోయిందని ఎద్దేవా చేశారు. చెప్పు గురించి కాకుండా ముందు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ గుర్తుపై ఆలోచించాలని పేర్ని నాని హితవు పలికారు.