COVID Case: మళ్లీ విజృంభిస్తున్న కోవిడ్..రాష్ట్రంలో తొలి కేసు నమోదు ..!!

Update: 2025-05-23 01:09 GMT

COVID cases: దేశంలో మరోసారి పడగవిప్పిన కోవిడ్..4వేలకుపైగా యాక్టివ్ కేసులు..!!

COVID Case: దేశంలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇదే తరుణంలో ఏపీలో తొలి కోవిడ్ పాజిటివ్ కేసు నమోదవ్వడం ప్రజల్లో ఆందోళనను పెంచుతోంది. విశాఖ జిల్లా మద్దిపాలెంకు చెందిన ఓ వివాహితకు కోవిడ్ 19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది గత కొన్నాళ్లుగా ఆమెకు జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపించడంతో హాస్పిటల్ కు వెళ్లింది. అనుమానం వచ్చిన వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. సదరు మహిళతో పాటు ఆమె భర్త, ఇద్దరు పిల్లలకు కూడా కోవిడ్ టెస్ట్ చేశారు. వారిందరికీ నెగెటివ్ వచ్చింది కాగా మహిళను వైద్యులు వారం పాటు హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించారు.

మహిళ నివాసం ఉండే పిఠాపురం కాలనీలో ఆమెకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలియడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. స్థానికంగా మూడు టీములతో ఇంటింటికి సర్వీ ప్రారంభించింది. దగ్గరలో ఉన్న ప్రజలకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఆమె కు మొదట మలేరియా లేదా డెంగ్యూ అని భావించిన వైద్యులు సంబంధిత పరీక్షలను చేశారు. అయితే ఫైనల్ గా విజయ డయాగ్నిస్టిక్స్ లో నిర్వహించిన పరీక్షల్లో కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగుపడిందని వైద్యులు తెలిపారు. ఈ సాయంత్రానికి ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్ చేయనున్నట్లు చెప్పారు. 

Tags:    

Similar News