Gudivada Amarnath: మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కి పెందుర్తి అసెంబ్లీ టికెట్?
Gudivada Amarnath: పెందుర్తి టికెట్ తమ నేతకే వస్తుందంటోన్న గుడివాడ వర్గీయులు
Gudivada Amarnath: మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కి పెందుర్తి అసెంబ్లీ టికెట్?
Gudivada Amarnath: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి గుడివాడ అమర్‌నాథ్ పెందుర్తి నుంచి పోటీ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. పార్టీ హైకమాండ్ టికెట్ ఖరారు చేసేసిందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం అనకాపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అమర్‌నాథ్ స్థానంలో.. భరత్‌కుమార్‌ను ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీంతో గుడివాడ అమర్‌నాథ్‌కు టికెట్ వస్తుందా లేదా అనే సస్పెన్స్ నెలకొంది. పార్టీ కోసం టికెట్ త్యాగానికి సిద్ధమంటూ పలుమార్లు అమర్‌నాథ్ తెలిపారు. అధిష్టానం కూడా ఇన్‌ఛార్జ్‌ను మారుస్తూ నిర్ణయం తీసుకోవడంతో గుడివాడ అనుచరులు డీలా పడ్డారు. అయితే తాజాగా ఆయనకు టికెట్ కన్ఫామ్ అంటూ అనుచరవర్గం భావిస్తోంది. తమ నేత పెందుర్తి పోటీ చేస్తారంటూ ప్రచారాలు కూడా మొదలయ్యాయి.