మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలకు తప్పిన ప్రమాదం

*కాన్వాయ్‌లోని ఎంపీ మిథున్‌రెడ్డి వాహనాన్ని ఢీకొట్టిన కారు

Update: 2023-01-16 09:30 GMT

మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలకు తప్పిన ప్రమాదం

Road Accident: మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలకు పెను ప్రమాదం తప్పింది. కాన్వాయ్‌లోని ఎంపీ మిథున్‌రెడ్డి వాహనాన్ని ఎదురుగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. కారు ఓవర్‌టేక్ చేసే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మిథున్‌రెడ్డి వాహనంలో ఉన్న 8 మందికి, ఎంపీ పీఏ, భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి కలిసి వాహనంలో వెళ్తుండగా రాయచోటి మండలం చెన్నముక్కపల్లె రింగ్ రోడ్డు వద్ద ఘటన జరిగింది.

Tags:    

Similar News