Pawan Kalyan: జగన్ సర్కారుపై ప్రధాని మోడీకి లేఖ రాసిన పవన్
Pawan Kalyan: ఇళ్ల పట్టాలు, నిర్మాణంపై ప్రభుత్వం భిన్న ప్రకటనలు
Pawan Kalyan: జగన్ సర్కారుపై ప్రధాని మోడీకి లేఖ రాసిన పవన్
Pawan Kalyan: ఏపీలో భారీ అవినీతి జరిగిందని ప్రధాని మోడీకి పవన్‌కళ్యాణ్ లేఖ రాశారు. వైసీపీ పాలనలో గృహ నిర్మాణాల్లో జరిగిన అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన కోరారు. లేఖలో జగన్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో పవన్ ఆరోపించారు. పేదలకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి భూసేకరణకు ప్రభుత్వం రూ.32వేల141 కోట్ల నిధులను విడుదల చేసిందని పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన భూ సేకరణలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు కీలకంగా వ్యవహరించారని చెప్పారు. ఈ క్రమంలోనే భారీ అవినీతికి తెరతీశారని మండిపడ్డారు. గతంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు అందించలేదని చెప్పారు. మొత్తంగా 6.68 లక్షల టిడ్కో ఇళ్లు నిర్మాణం పూర్తవగా.. అందులో కేవలం 86వేల 984 మందికి మాత్రమే అందించారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.