అమిత్ షాతో భేటీ అనంతరం ట్విట్టర్‌లో పవన్ ఆసక్తికర ట్వీట్
Pawan Kalyan: అమిత్ షా జీతో అద్భుతమైన సమావేశం జరిగింది
అమిత్ షాతో భేటీ అనంతరం ట్విట్టర్‌లో పవన్ ఆసక్తికర ట్వీట్
Pawan Kalyan: ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. నిన్న ఎన్డీఏ సమావేశంలో పాల్గొన్న జనసేనాని.. ఎన్డీఏ భేటీ అనంతరం పలువురు బీజేపీ పెద్దలను కలుస్తున్నారు. ఇందులో భాగంగానే కాసేపటి క్రితం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఆయన భేటీ అయ్యారు. దాదాపు 15 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్టు సమాచారం. ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులతో పాటు.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేసే విషయంపై చర్చించినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. అమిత్‌షాతో పవన్ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే.. అమిత్ షాతో భేటీ అనంతరం.. ట్విట్టర్ లో ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు పవన్. అమిత్ షా జీతో అద్భుతమైన సమావేశం జరిగిందన్నారు. పరస్పర చర్చలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నిర్మాణాత్మక, నిర్ణయాత్మక, సుసంపన్నమైన భవిష్యత్తుకు నాంది పలుకుతాయని తాను భావిస్తున్నానంటూ ట్వీట్ చేశారు పవన్.