Pawan Kalyan: గతంలో మేం తగ్గాం... ఈసారికి మీరు తగ్గండి..

Pawan Kalyan: పొత్తుల అంశాన్ని జనసేన కార్యకర్తలు తేలిగ్గా తీసుకోవాలని సూచన

Update: 2022-06-05 01:37 GMT

గతంలో మేం తగ్గాం... ఈసారికి మీరు తగ్గండి..

Pawan Kalyan: చివరి పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా అన్న సినిమా డైలాగ్ లాగానే జనసేనాని పవన్ కళ్యాణ్ పొలిటికల్ పంచ్ లు విసిరారు. పొత్తులపై రాష్ట్ర రాజకీయాల్లో తలెత్తిన ఊహాగానాలకు తెరదించారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి తమకు ఉన్న అన్ని అవకాశాలను తేట తెల్లం చేస్తూ ఆప్షన్ ను టీడీపీ, బీజేపీలకు వదిలేశారు.

మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం లో విస్తృతస్థాయి సమావేశం జరిగింది. పార్టీ ముఖ్య నేతలతో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించి మూడు కీలక తీర్మానాలు చేశారు. అందులో మొదటిది రైతుల సమస్యల పరిష్కారానికి వారికి పార్టీ అండగా ఉండాలని రెండోది కోనసీమ ప్రాంతంలో చెలరేగిన అల్లర్ల వెనుక ఉన్నవారిని పట్టుకుని అక్కడ సాధారణ పరిస్థితులు వచ్చేలా శాంతి కమిటీలు ఏర్పాటు చేయాలని, అమాయకులపై అక్రమ కేసులు పెట్టరాదని తీర్మానించారు. ఇక మూడో తీర్మానంలో భాగంగా జనసేన నాయకులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారని రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల వైఫల్యానికి అధికార వైసిపియే కారణమని తీర్మానించారు.

అనంతరం జనసేనాని పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం చేశారు. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ, ఇప్పుడే చర్చనీయాంశంగా మారిన పొత్తులపై స్పందించారు. 2014లో రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ, టీడీపీతో కలిశామని, విజయం సాధించామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన పార్టీ చాలాసార్లు తగ్గిందని, ఇప్పుడు మిగతా పార్టీలు తగ్గితే బాగుంటుందని పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

ఈసారి జనసేన ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయని వెల్లడించారు. బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వాన్ని స్థాపించడం బీజేపీతో పాటు టీడీపీని కూడా కలుపుకుని ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వాన్ని స్థాపించడం జనసేన ఒక్కటే ప్రభుత్వాన్ని స్థాపించడం తమ ముందున్న అవకాశాలు అని పవన్ కల్యాణ్ వివరించారు. 

Tags:    

Similar News