Pawan Kalyan: మాది రౌడీసేన కాదు.. విప్లవసేన
Pawan Kalyan: వైసీపీ నేతల ఉడుత ఊపులకు మేం భయపడం
Pawan Kalyan: మాది రౌడీసేన కాదు.. విప్లవసేన
Pawan Kalyan: సాటి ప్రజలకు, జనాలకు అన్యాయం జరుగుతుంటే తాను రోడ్లపైకి వచ్చానని పవన్ కల్యాణ్ చెప్పారు. ఓ పద్ధతి పాడూ లేకుండా, అన్యాయంగా ఇళ్లు కూల్చివేస్తుంటే ప్రశ్నించేందుకు వచ్చానని వివరించారు. అన్యాయం తన గడప తొక్కే వరకూ వేచి ఉండలేదని, అలా తాను ఉండలేనని స్పష్టం చేశారు. జనసేనను రౌడీసేన అంటున్న వైసీపీ నేతలకూ పవన్ కౌంటర్ ఇచ్చారు. తమది రౌడీసేన కాదని.. విప్లవ సేన అని చెప్పారు. రౌడీయిజం చేసేవాళ్లకు, గుండాయిజం చేసేవాళ్లకు ఎదురు తిరగడం రౌడీయిజమేనని వైసీపీ నేతలు భావిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల వంటి దౌర్జన్యాలు చేసే వారికి రౌడీలుగా కనిపిస్తే తమకు అభ్యంతరంలేదని పవన్ కల్యాణ్ చెప్పారు. కానీ ప్రజల దృష్టిలో మాత్రం జనసైనికులు విప్లవకారులని పవన్ కల్యాణ్ వివరించారు.