Janasena: జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌కల్యాణ్ ఎన్నిక

Janasena: మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనాసభపక్ష సమావేశం జరిగింది.

Update: 2024-06-11 05:14 GMT

Janasena: జనసేన శాసనసభాపక్ష నేతగా పవన్‌కల్యాణ్ ఎన్నిక

Janasena: మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనాసభపక్ష సమావేశం జరిగింది. పవన్‌కల్యాణ్‌ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు జనసేన ఎమ్మెల్యేలు. కాగా తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ పవన్‌కల్యాణ్ పేరును ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనకు మిగిలిన ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

మరోవైపు మంత్రివర్గ కూర్పుపై చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. జనసేన నుంచి మూడు లేదా నాలుగు.. బీజేపీ నుంచి ఇద్దరికీ మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పవన్‌కల్యాణ్‌కు డిప్యూటీ సీఎంతో పాటు కీలక మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇక మంత్రివర్గంలో సామాజికవర్గాలతో పాటు మహిళలకు, యువతకు పెద్దపీఠ వేయనున్నారు. సాయంత్రంలోగా మంత్రివర్గ కూర్పుపై పూర్తి స్పష్టత రానుంది. కేబినెట్‌లో చోటు దక్కిన వారికి ఈ సాయంత్రం ఫోన్లు చేయనున్నారు. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసే వారితో సాయంత్రం చంద్రబాబు సమావేశం కానున్నారు.

Tags:    

Similar News