Pawan Kalyan: ఏపీలో 10వ తరగతి పరీక్షల నిర్వహణ మూర్ఖత్వమే‌: పవన్ కళ్యాణ్

Pawan Kalyan: 10వ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహిస్తామనడం ఏపీ ప్రభుత్వ మూర్ఖత్వానికి నిదర్శనం అని పవన్ అన్నారు.

Update: 2021-04-20 08:03 GMT

AP 10th Exams

Pawan Kalyan: దేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంటే నేపథ్యంలో ఏపీ సర్కార్ పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామనడం ప్రభుత్వ మూర్ఖత్వానికి అద్దం పడుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. గత మూడు రోజులగా కరోనాతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. లక్షలాది విద్యార్థులతో పాటు వారి కుటుంబాలను కరోనా ముప్పులోకి నెట్టేస్తున్నారని అభ్యంతరం తెలిపారు. సీబీఎస్ఈ కూడా పదో తరగతి పరీక్షలను రద్దు చేసి ప్రమోట్ చేసిందని…ఒక్క ఏపీ సర్కారుకు మాత్రమే మిలిట్రీ నియామకాలు ఇబ్బంది వచ్చిందా? అని ప్రశ్నించారు. తక్షణమే 10 తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు రద్దు చేసి…పై తరగతులకు ప్రమోట్ చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.

పూర్తి వివరాలు ఈ విధంగా..

''కరోనా తీవ్రత వల్ల ఆరోగ్య విపత్తు తలెత్తి ప్రజలందరూ తీవ్ర భయాందోళనలో ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్న చందాన వ్యవహరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారినపడ్డారు. అదే విధంగా అనేక జూనియర్ కాలేజీలు, ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు, వాటి హాస్టళ్లలో ఉన్నవారు ఈ వైరస్ సోకి ఇబ్బందులుపడుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ వల్ల నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదవుతుంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తాను చెప్పిన షెడ్యూల్ ప్రకారమే 10వ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించడం ప్రభుత్వ మూర్ఖత్వ పోకడ అని అర్థం అవుతోంది.

ప్రజల యోగక్షేమాలు, ఆరోగ్యంపై ఏ మాత్రం బాధ్యత లేకపోవడమే...

45ఏళ్ళు దాటినవారు… దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు… వృద్ధులు… చిన్నారులను కరోనా ముప్పు నుంచి జాగ్రత్తగా కాపాడుకోవాలి అని వైద్య నిపుణులు పదేపదే చెబుతూ ఉన్నారు. ఎటువంటి లక్షణాలు చూపించకుండా కరోనా వైరస్ మానవాళిపై దాడి చేస్తుంటే – పదో తరగతి, ఇంటర్మీడియెట్ విద్యార్థులకు క్లాసులు, పరీక్షలు నిర్వహిస్తామని చెప్పడం పాలకులకు ప్రజల యోగక్షేమాలు, ఆరోగ్యంపై ఏ మాత్రం బాధ్యత లేకపోవడమే అవుతుంది. తరగతులు, పరీక్షల కోసం వెళ్ళి వచ్చే విద్యార్థుల ద్వారా వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉంది. పదో తరగతికి 6.4 లక్షల మంది, ఇంటర్మీడియెట్ కు 10.5 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. అంటే సుమారుగా 16.5 లక్షల మందిని, వారి కుటుంబాలను ప్రభుత్వం నేరుగా కరోనా ముప్పులోకి గెంటి వేస్తున్నట్లే. ఆ విద్యార్థుల కుటుంబాల్లో 45ఏళ్ళు పైబడినవారు, వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉంటారు. వారందరినీ కరోనా చుట్టుముడితే బాధ్యత ఎవరు తీసుకుంటారు?

వారు త్వరగా కోలుకోవాలి....

అలాగే, మ‌న్మోహ‌న్ సింగ్ ఎయిమ్స్‌లో చేరిన‌ట్లు స‌మాచారం అందింద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. ఆయ‌న కూడా త్వ‌ర‌గా కోలుకోవాల‌ని,
కేసీఆర్
కు క‌రోనా సోకిన విష‌యం తెలిసిందే. దీనిపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందిస్తూ.. కేసీఆర్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఆయ‌న కోలుకుని ఎప్ప‌టిలాగే ప్ర‌జా సేవ‌లో నిమ‌గ్నం కావాల‌ని దేవుడిని ప్రార్థిస్తున్నాన‌ని ప‌వ‌న్ పేర్కొన్నారు. 

Tags:    

Similar News