ఏపీ రాజధాని అంశంపై పవన్ కీలక నిర్ణయం

Update: 2019-12-19 04:27 GMT
pawan kalyan

ఏపీకి మూడు రాజధానులు ఉండబోతున్నాయంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే..జగన్ చేసిన వాఖ్యాలపై ఇప్పుడు అమరావతి ప్రాంతం రైతుల్లో ఆందోళన మొదలయ్యింది. రాజధాని కోసం 33 వేల ఎకరాలు భూమి ఇస్తే ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయం మార్చుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అందులో భాగంగానే రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తూ 29 గ్రామాల్లో గురువారం బంద్ పాటిస్తున్నారు.

ఈ నేపధ్యంలో అమరావతిలో నెలకొన్న పరిస్థితుల్ని పరిశీలించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కమిటీని నియమించారు. ఇందులో భాగంగా ఓ ప్రకటనన ఐ విడుదల చేశారు. అందులో "రాజధాని అమరావతి ప్రాంతంలో నెలకన్న పరిస్టితులను పరిశీలించేందుకు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ శ్రీ నాదెండ్ల మనోహర్‌ గారిని ఆ ప్రాంతంలో పర్శటించమని సూచించాను. ఆయన నేతృత్వంలే రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, అధికార ప్రతినిధులు రాజధాని గ్రామాల్లో 20-12-19 శుక్రవారం పర్యటిస్తారు. రాజధాని కేసం భూములు ఇచ్చిన రైతులు, స్టానికులలో నెలకిన్న భయాందేళనలను ఈ బృందం తెలుసుకుంటుంది. ఆ ప్రాంత ప్రజలకు జనసేన ఎప్పుడూ భరీసాగా నిలుస్తుంది. రాజధానిపై నిపుణుల కమిటీ నివేదిక వచ్చే వరకూ అనుసరించాల్సిన కార్యాచరణను ఈ బృందం రైతులతో చర్చిస్తుంది." అంటూ పేర్కొన్నారు పవన్.

అంతేకాకుండా "అమరావతి రాజధాని ప్రాంత రైతులు మూడు పంటలు పండే భూముల్ని ,గత ప్రభుత్వ హయాంలో, రాజధాని కేసం వారి భూములు అడిగినప్పుడు , అనేక భయాలు, అభద్రతా భావాల మధ్యలో , ప్రభుత్వం మోసం చేయదనే నమ్మకంతోనే కాక మరి రాష్ట్ర భవిష్యత్తు కేసమని ఇచ్చారు. కానీ కత్త వైసీపీ ప్రభుత్వం రాగానే, వచ్చిన కొద్ది రీజులనించి రాజధానిపై ,ఒక స్పష్టత లేని ప్రకటనలు ,నిన్నటి అసెంబ్లీ సమావేశాలలో దాక చోటు చేసుకున్న మార్పులు , సహజంగానే భూములు కల్లోయిన రైతులులో ఉన్న భయాలు వారి వేదన ఉండటం సహజం. ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని రైతులకి భరీసా,మనోధైర్యం ఇవ్వటానికి , ముఖ్యమైన నాయకులని నాదెండ్ల మనోహర్‌ గారి ఆధ్వర్యంలో వారి దగ్గరికి పంపిస్తున్నాను . ఇంకా వైసీపీ ప్రభుత్వం వేసిన నిపుణల కమిటీ నివేదిక ఇచ్చే వరకు దయచేసి వేచియుండండి , అందులో పొందుపరిచిన నిర్ణయాలిని బట్టి స్పందిద్దాం" అమరావతి రైతుల్ని కోరారు పవన్ కళ్యాణ్.

ఏపీ అసెంబ్లీలో రాష్ట్రానికి మూడు రాజధానులు ఉండొచ్చని జగన్ ప్రకటించడంతో ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ అమరావతి రైతులు ఆందోళనలు చేపట్టారు.

Tags:    

Similar News