Pawan Kalyan: జగన్ నాయకుడు కాదు.. వ్యాపారి.. ఎప్పుడూ డబ్బు పిచ్చే
Pawan Kalyan: విశాఖలో జనసేనాని 3వ విడత వారాహి యాత్ర
Pawan Kalyan: జగన్ నాయకుడు కాదు.. వ్యాపారి.. ఎప్పుడూ డబ్బు పిచ్చే
Pawan Kalyan: జగన్ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. విశాఖలో 3వ విడత వారాహియాత్రలో జగన్ టార్గెట్‌గా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తన గొంతు నొక్కుదామని చూస్తున్న వైసీపీ నాయకులకు నమస్కారం అంటూ ప్రసంగాన్ని స్టార్ట్ చేసిన పవన్.. ఆంధ్ర ప్రజలని జగన్ బానిసలుగా చూస్తున్నారని ఆరోపించారు. పోలీసులను, అధికారులను భయపెడుతున్నారని విమర్శనాస్త్రాలు సంధించారు. ఇక.. వైసీపీని తన్ని తరిమేసే వరకు నిద్రపోనన్న పవన్.. గంజాయిని తగులబెట్టినందుకే గౌతం సవాంగ్‌ను బదిలీ చేశారంటూ వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఎంపీ ఎంవీవీ కుటుంబానికే దిక్కు లేదు.. ఇక సామాన్యుడికి ఏం రక్షణ ఉంటుందని ప్రశ్నించారు. తెలంగాణ రావడానికి ముఖ్యకారణం జగన్ అంటూ ఫైర్ అయ్యారు. జగన్ నాయకుడు కాదు.. వ్యాపారి అంటూ కామెంట్స్ చేశారు పవన్. జగన్ తీరుపై కేంద్రానికి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకునేలా చూస్తానన్న పవన్.. కమీషన్ల కోసమే జగన్ ఆశ అని ఎద్దేవా చేశారు.