Pawan Kalyan: అందుకే ఎన్టీఆర్ ట్రస్ట్‌కు నా వంతుగా రూ.50లక్షల విరాళమిస్తున్నా..
తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్‌కు రూ. 50 లక్షలు విరాళం ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
Pawan Kalyan: అందుకే ఎన్టీఆర్ ట్రస్ట్‌కు నా వంతుగా రూ.50లక్షల విరాళమిస్తున్నా..
Euphoria Musical Night: తలసేమియా బాధితులకు సహాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎఓం పవన్ కల్యాణ్, మంత్రి నారాలోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ఎన్టీఆర్ ట్రస్ట్ కు 50 లక్షల రూపాయలు విరాళం అంద చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌ను ఎన్నో ఏళ్లుగా చంద్రబాబు కాపాడుకుంటూ వచ్చారన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ సభ్యులందరికీ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు.
తామంతా ఎన్టీఆర్ ట్రస్ట్ కోసం తమవంతు సాయం చేస్తామని పవన్ చెప్పారు. తాను కూడా తలసేమియా బాధితుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్‌కు రూ. 50 లక్షలు విరాళం ఇస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. యూఫోరియాకు తాను టికెట్ కొనకుండా వచ్చానని.. ఇది తనకు గిల్టిగా అనిపించిందన్నారు. అందుకే రూ. 50 లక్షలు విరాళం అందిస్తున్నట్లు చెప్పారు.
నారా భువనేశ్వరి అంటే తనకు నాకేంతో గౌరవం, కష్టాలు, ఒడుదుడుకుల్లో చెక్కు చెదరకుండా బలమైన సంకల్పంతో ఉన్న ఆమెను దగ్గరి నుంచి చూశానన్నారు పవన్ కల్యాణ్. అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ టర్స్ట్ నేతృత్వంలో తలసేమియా బాధితుల కోసం కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.