టీడీపీకి కొత్త కార్యవర్గాలు

సంస్థాగత ప్రక్షాళనకు టీడీపీ నడుం బిగించింది. దీనిలో భాగంగా కొత్త కమిటీల ఏర్పాటుతోపాటు అనేక మంది నేతలకు కొత్త బాధ్యతలు అప్పగించనుంది. సంస్థాగత పునర్నిర్మాణం..

Update: 2020-09-27 02:40 GMT

నేడు టీడీపీ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు పేరు దాదాపు ఖరారు చేశారు.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు. ఇక ఈసారి నుంచి జిల్లాల వారీగా కాకుండా 25 పార్లమెంటు సెగ్మెంట్లకు 25 మంది అధ్యక్షులను ప్రకటించనుంది. జిల్లా కమిటీల మాదిరిగా పూర్తిస్థాయిలో పార్లమెంటు కమిటీలు పనిచేస్తాయి. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక అధ్యక్షుడితోపాటు అతనికి సహాయంగా ఇద్దరు నాయకులను కూడా నియమిస్తారు. అంతేకాకుండా ఈ ముగ్గురు సమన్వయ కమిటీగా ఏర్పడి పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను ముందుకు తీసుకువెళతారు. ఇక పార్లమెంటు కమిటీ అధ్యక్షులు మండల, గ్రామ స్థాయి కమిటీలను నియమిస్తారు.

అయితే ఈ స్థానిక కమిటీలను రాష్ట్ర కమిటీ పరిశీలించిన తరువాతే ప్రకటిస్తారు. అయితే స్థానిక కమిటీలను మరో ఏడాది లోగా పూర్తిచెయ్యాలి టీడీపీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారు. గత మే నెలలో మహానాడు జరిగిన వెంటనే ఏపీ, తెలంగాణ రాష్ట్ర కార్యవర్గాలు, జాతీయ కార్యవర్గాలను చంద్రబాబు ఎంపిక చేయాల్సి ఉన్నా ఆలస్యం అయింది. అయితే దాదాపు రెండు నెలల పాటు కసరత్తు చేసి వివిధ సామాజిక వర్గాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర కార్యవర్గం ఎంపిక పూర్తి చేశారు చంద్రబాబు.

Tags:    

Similar News