Paritala Sunitha: రైతుల కోసం మాజీ మంత్రి పరిటాల సునీత పాదయాత్ర

Paritala Sunitha: గాండ్లపర్తి నుంచి రాప్తాబు వరకు పాదయాత్ర

Update: 2022-11-22 10:30 GMT

Paritala Sunitha: రైతుల కోసం మాజీ మంత్రి పరిటాల సునీత పాదయాత్ర

Paritala Sunitha: వైసీపీ ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తోందన్నారు మాజీ మంత్రి పరిటాల సునీత. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రైతు సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. గాండ్లపర్తి నుంచి బుక్కచెర్ల అయ్యవారిపల్లి మీదుగా రాప్తాడు వరకు 15 కిలోమీటర్ల మేర రైతుల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. తాను రైతుల కోసం పాదయాత్ర చేస్తుంటే వైసీపీ ప్రభుత్వం దాని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. తన పాదయాత్రను అడ్డుకునే క్రమంలో 200 మంది పోలీసులతో గ్రామాల్లో పికెట్ నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. ఈరైతు సంఘీభావ యాత్రలో రైతులకు జరిగిన అన్యాయాలు తెలుసుకుంటామన్నారు. రైతుల నుంచి వినతులు స్వీకరించి ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. తన పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి వైసిపి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఓర్వలేకున్నారన్నారని మండిపడ్డారు.

Tags:    

Similar News