ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెర..ఏకగ్రీవాలపై దృష్టి సారించిన వైసీపీ

ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల ప్రక్రియ సంబంధించి అధికారులు అన్నీ ఏర్పాట్లను పూర్తి చేశారు.

Update: 2021-02-07 14:48 GMT

ఏపీలో తొలి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల ప్రక్రియ సంబంధించి అధికారులు అన్నీ ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇప్పటికే పలు గ్రామాలు ఏకగ్రీవమైనప్పటికీ.. ఎన్నికల అధికారలు మాత్రం వాటిపై స్పష్టతనివ్వలేదు. ఫిబ్రవరి 9న ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.

ఏపీలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. దీంతో పోలింగ్‌కు సంబంధించిన ఆంక్షలు అమలులోకి వచ్చాయి. 12 జిల్లాల్లోని 18 డివిజన్లలో ఫిబ్రవరి 9న తొలివిడత పోలింగ్‌ జరగనుంది. 3వేల 225 గ్రామాల్లో.. లక్షా 36వేల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మంగళవారం ఉదయం 6గంటల 30నిమిషాల నుంచి మధ్యాహ్నం 3గంటల 30నిమిషాలక వరకు పోలింగ్‌ జరగనుంది. అయితే సమస్యాత్మక ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒకట్నిర గంటలకే పోలింగ్‌ నిర్వహించనున్నారు అధికారులు.

పోలింగ్‌ ముగిసిన మూడు గంటల వ్యవధిలోనే ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. తర్వాత సర్పంచ్‌గా గెలిచిన అభ్యర్థిని ప్రకటిస్తారు. అనంతరం ఉప సర్పంచ్‌ ఎన్నిక కూడా చకచక జరిగిపోనుంది. ఇక ఇప్పటికే పోలింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు అధికారులు తెలియజేశారు. అటు భద్రతా విషయంలో కూడా పోలీసుశాఖ పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టింది. ప్రతీ ఓటింగ్‌ కేంద్రం దగ్గర ఒక ఎస్సై, నలుగురు కానిస్టేబుళ్లు ఉండనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. వైసీపీ ఏకగ్రీవాలపై దృష్టిసారించింది. అయితే ఇప్పటికీ పలు గ్రామాల్లో ఏకగ్రీవాలు జరిగినా ఎన్నికల అధికారులు మాత్రం వాటిపై ఇంకా అధికారికంగా స్పష్టతనివ్వలేదు. అదేవిధంగా టీడీపీ పల్లెల్లో ప్రగతికి మేనిఫెస్టో ఇచ్చి అబాసుపాలైంది. దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేసింది. చెప్పాలంటే కొన్ని చోట్ల ఏకగ్రీవాల్లో కూడా అగ్గి రాజు కుంది. అటు వైసీపీ మెజారిటీ పంచాయతీలు తమవేనని ధీమా వ్యక్తం చేస్తుంటే.. తామేమి తక్కువకాదంటూ టీడీపీ కూడా గెలుపు ధీమాపై ఉంది.

Tags:    

Similar News