Panchayat Election 2021: అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికలు
* 4పంచాయతీలు, 31 వార్డులకు జరుగుతున్న పోలింగ్
అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికలు(ఫైల్ ఫోటో)
Panchayat Election 2021: అనంతపురం జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. జిల్లాలో నాలుగు పంచాయతీలు, 31 వార్డులకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే 26 వార్డులు ఏకగ్రీవమైనట్లు అధికారులు తెలిపారు.
జిల్లాలోని పుట్లూరు మండలం కంది కాపుల, లేపాక్షి మండలం కంచి సముద్రం, శేట్టూరు మండలం ఖైరేవు, రొద్దం మండలం చిన్న మత్తూరు సర్పంచ్ స్థానాలకు ఎన్నికల కొనసాగుతున్నాయి.