Representational Image
అనంతపురం జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కావడంతో ఏకగ్రీవమయ్యే పంచాయతీలపై సాయంత్రానికి స్పష్టత రానుంది. మరోవైపు మూడో విడత పంచాయతీలకు సంబంధించి నామినేషన్ వేయడానికి చివరిరోజు కావడంతో నామినేషన్ కేంద్రాల దగ్గర అభ్యర్థులు పెద్దఎత్తున బారులు తీరారు. రెండో విడతలో 310 పంచాయతీలు, 3 వేల 220 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మూడో విడతలో 169 పంచాయతీలు, 3 వేలకు పైగా వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.